'గుడ్ బ్యాడ్ అగ్లీ' కొత్త షెడ్యూల్ ప్రారంభం అప్పుడేనా?

by సూర్య | Tue, Jul 09, 2024, 03:23 PM

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని జులై చివరి వారంలో ప్రారంభించటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM