డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మైదాన్' తెలుగు వెర్షన్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:21 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే  ఈ సినిమా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
బాలీవుడ్‌లో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసిన 'డబుల్ ఇస్మార్ట్' Fri, Jul 19, 2024, 05:53 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Fri, Jul 19, 2024, 05:51 PM
'విదా ముయార్చి' నుండి థర్డ్ లుక్ అవుట్ Fri, Jul 19, 2024, 05:49 PM
లండన్ లో 'టాక్సిక్' తదుపరి షెడ్యూల్ Fri, Jul 19, 2024, 05:47 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Fri, Jul 19, 2024, 05:46 PM