by సూర్య | Tue, Jul 09, 2024, 03:07 PM
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాకి నటి ప్రియాంక అరుల్ మోహన్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఈ సినిమాలో నటి చారులత అనే పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
Latest News