'ఆపరేషన్ రావణ్' ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే ...!

by సూర్య | Tue, Jul 09, 2024, 01:42 PM

వెంకట సత్య దర్శకత్వంలో హీరో రక్షిత్ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆపరేషన్ రావన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సంగీత విపిన్ కథానాయికగా నటించారు. ద్విభాషా సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని జులై 10న ఉదయం 11:07 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రాధికా శరత్‌కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, KA పాల్ రాము, విద్యా సాగర్, TV5 మూర్తి, కార్తీక్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
త్వరలో విడుదల కానున్న 'స్వయంభూ' టీజర్ Fri, Jul 18, 2025, 06:55 PM
AA22XA6 కోసం అట్లీ మరియు సాయి అభ్యంక్కర్ జామ్ సెషన్ Fri, Jul 18, 2025, 06:49 PM
త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న 'బింబిసార' సీక్వెల్ Fri, Jul 18, 2025, 06:41 PM
శివకార్తికేన్ - వెంకట్ ప్రభు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ కంపోజర్ Fri, Jul 18, 2025, 06:38 PM
'విశ్వంబర' కొత్త షెడ్యూల్ ప్రారంభం ఎప్పుడంటే..! Fri, Jul 18, 2025, 06:32 PM