$15.5M మార్క్ కి చేరుకున్న 'కల్కి' నార్త్ అమెరికా ప్రీమియర్స్ గ్రాస్

by సూర్య | Mon, Jul 08, 2024, 03:31 PM

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'కల్కి' ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ అండ్ AAA క్రియేషన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీమియర్ గ్రాస్ $15.5M మార్క్ కి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రంలో దిశా పటాని, పశుపతి, మరియు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM