'రాయన్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే....!

by సూర్య | Sat, Jul 06, 2024, 05:08 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రానికి తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రాయన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని జులై రెండో వారంలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రానున్న రోజులలో చిత్ర బృందం అధికారిక తేదీని ప్రకటించనుంది. ఈ సినిమాలో విష్ణు విశాల్, దుషార విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వరాఘవన్,ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి మరియు SJ సూర్య కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ధనుష్ పవర్ ఫుల్ క్యామియోలో కనిపించనున్నాడు. నార్త్ మద్రాస్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు మరియు హిందీలో జులై 26, 2024న థియేటర్లలో విడుదల కానుంది.

Latest News
 
'జై హనుమాన్' ఫస్ట్ లుక్ పోస్టర్ అవుట్ Wed, Oct 30, 2024, 09:12 PM
నయనతార డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..! Wed, Oct 30, 2024, 09:03 PM
రవితేజ కొత్త సినిమా టైటిల్‌ ‘మాస్‌ జాతర Wed, Oct 30, 2024, 09:01 PM
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM