'ఎమర్జెన్సీ' విడుదల ఎప్పుడంటే...!

by సూర్య | Tue, Jun 25, 2024, 03:48 PM

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీలో భారత ప్రథమ మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రం ఇందిరా గాంధీ పాలనలో 1975 నుండి 1977 వరకు కొనసాగిన 'ఇండియన్ ఎమర్జెన్సీ' ఆధారంగా రూపొందించబడింది. అనేక వాయిదాల తర్వాత, ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసింది. తాజాగా ఇప్పుడు ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6, 2024న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని చేసి ప్రకటించారు. ఈ సినిమాకి కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ మరియు విశాక్ నాయర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM