నేడే 'బడ్డీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్

by సూర్య | Tue, Jun 25, 2024, 01:29 PM

సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో మధ్యాహ్నం 3 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రం తమిళ నటుడు ఆర్య యొక్క టెడ్డీకి అధికారిక రీమేక్. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు.

Latest News
 
చీరకట్టులో మత్తెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ Sat, Oct 26, 2024, 12:09 PM
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM