'బడ్డీ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్

by సూర్య | Mon, Jun 24, 2024, 06:35 PM

సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని రేపు హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో మధ్యాహ్నం 3 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం తమిళ నటుడు ఆర్య యొక్క టెడ్డీకి అధికారిక రీమేక్. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

Latest News
 
యోగి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'కంగువ' టీమ్ Mon, Jul 22, 2024, 06:51 PM
'సరిపోదా శనివారం' నాట్ ఏ టీజర్ కి భారీ రెస్పాన్స్ Mon, Jul 22, 2024, 06:49 PM
బ్రహ్మాజీ తో 'అలనాటి రామచంద్రుడు' టీమ్ ఇంటర్వ్యూ అవుట్ Mon, Jul 22, 2024, 06:46 PM
సమంత కొత్త వెబ్ సిరీస్ కి టైటిల్ లాక్ Mon, Jul 22, 2024, 06:43 PM
ఆఫీసియల్ : విడుదల తేదీని లాక్ చేసిన 'కమిటీ కుర్రోళ్లు' Mon, Jul 22, 2024, 05:27 PM