'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సెకండ్ సింగల్ రిలీజ్

by సూర్య | Mon, Jun 24, 2024, 03:19 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని చిన్న చిన్న కనగల్ అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
'రాబిన్‌హుడ్' టీజర్ విడుదల ఎప్పుడంటే..! Mon, Oct 28, 2024, 05:55 PM
ఓపెన్ అయ్యిన 'అమరన్‌' బుకింగ్స్ Mon, Oct 28, 2024, 05:49 PM
'ఎన్టీఆర్31' సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా? Mon, Oct 28, 2024, 05:43 PM
'వెట్టయన్' నుండి మనసిలయో వీడియో సాంగ్ రిలీజ్ Mon, Oct 28, 2024, 05:39 PM
దీపావళికి విడుదల కానున్న 'NBK 109' టైటిల్ టీజర్ Mon, Oct 28, 2024, 05:35 PM