'వెట్టయన్' నుండి మనసిలయో వీడియో సాంగ్ రిలీజ్

by సూర్య | Mon, Oct 28, 2024, 05:39 PM

జై భీమ్ ఫేమ్ TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' చిత్రం అక్టోబర్ 10, 2024న తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సూపర్ కాప్ థ్రిల్లర్ లో లెజెండరీ నటుడు పోలీసు పాత్రలో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ  బిగ్గీ చాలా మంచి ఓపెనింగ్స్ సాధించింది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ సినిమా యొక్క మొదటి సింగిల్ "మనసిలయో" కి విష్ణు ఎదవన్ లిరిక్స్ అందించగా, మలేషియా వాసుదేవన్ తన గాత్రాన్ని అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యొక్క వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్ SR కతిర్ I.S.C మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, జిఎం సుందర్, రోహిణి, రావు రమేష్, కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన సుభాస్కరన్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM