by సూర్య | Sat, Jun 22, 2024, 04:37 PM
నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ నటించిన 'గం గం గణేశ' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో టాప్ ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Latest News