కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'మట్కా'

by సూర్య | Thu, Jun 20, 2024, 04:17 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాని పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'మట్కా' అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోని భారీ సెట్ లో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ హై-బడ్జెట్ మూవీలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి, నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డా.విజేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

Latest News
 
నవంబర్‌ 1న ఓటీటీలోకి 'విశ్వం' ? Wed, Oct 30, 2024, 12:30 PM
మా అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చదివించింది: కిరణ్‌ అబ్బవరం Wed, Oct 30, 2024, 12:11 PM
కంగువా మూవీ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి..! Wed, Oct 30, 2024, 11:59 AM
అయోధ్యలో వానరాల కోసం నటుడు అక్షయ్ కుమార్ రూ.కోటి విరాళం Wed, Oct 30, 2024, 11:13 AM
బ్లాక్ చీరలో గ్లామరస్‌గా సాక్షి మాలిక్ Tue, Oct 29, 2024, 08:54 PM