'లక్కీ బాస్కర్' నుండి ఫస్ట్ సింగల్ అవుట్

by సూర్య | Wed, Jun 19, 2024, 03:16 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్ యొక్క మూడవ స్ట్రెయిట్ తెలుగు సినిమా అయ్యిన ఈ సినిమా పై సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సెప్టెంబర్ 27, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని శ్రీమతి గారు అనే టైటిల్ తో  విడుదల చేసారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
అజిత్‌పై యువ నటుడు చేసిన ట్వీట్ వైరల్ Sat, Oct 26, 2024, 04:18 PM
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ ! Sat, Oct 26, 2024, 04:17 PM
డైరెక్టర్ సుజీత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'OG' టీమ్ Sat, Oct 26, 2024, 04:12 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Oct 26, 2024, 04:06 PM
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ Sat, Oct 26, 2024, 03:59 PM