దేవకీ నందన వాసుదేవ : 2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న జై బోలో కృష్ణ సాంగ్

by సూర్య | Wed, Jun 19, 2024, 02:43 PM

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవకీ నందన వాసుదేవ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని జై బోలో కృష్ణ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ 2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త వీడియో ని పోస్ట్ చేసి ప్రకటించారు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో అశోక్ సరసన వారణాసి మానస జోడిగా నటిస్తుంది. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM