'పుష్ప 2' విడుదల అప్పుడేనా?

by సూర్య | Mon, Jun 17, 2024, 03:48 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. కాని కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదల వాడయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమా 2024 క్రిస్మస్ కి విడుదల కానుందని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
ఒక ట్విస్ట్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'సిస్టర్ మిడ్నైట్' Wed, Jun 18, 2025, 08:04 AM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'ఎలెవెన్' Wed, Jun 18, 2025, 07:59 AM
150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'అనగనగా' Wed, Jun 18, 2025, 07:55 AM
ఆహా లో త్వరలో ప్రసారం కానున్న 'అలపుజా జింఖానా' Wed, Jun 18, 2025, 07:52 AM
'కుబేర' అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ స్పందన Wed, Jun 18, 2025, 07:47 AM