100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా'

by సూర్య | Mon, Jun 17, 2024, 02:51 PM

తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్ గోమతం నటించిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చి 29న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో అభినవ్ గోమతం సరసన వైశాలి రాజ్ జంటగా నటించింది. ఈ చిత్రాన్ని కాసుల క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై భవానీ కాసుల, ఆరెంరెడ్డి, ప్రశాంత్‌ వి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ రెజా, మోయిన్, నిజల్గల్ రవి, ఆనంద చక్రపాణి, తరుణ్ భాస్కర్, రవీందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, జ్యోతి రెడ్డి, సూర్య, రాకెట్ రాఘవ, శ్వేత అవస్తి, సాయి కృష్ణ, ఫణి చంద్రశేఖర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శామ్యూల్ అబీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM