'పొలిమేర 2' టెలివిషన్ ప్రీమియర్ కి తేదీ ఖరారు

by సూర్య | Mon, Jun 17, 2024, 02:49 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జూన్ 23, 2024న సాయంత్రం 06:30 గంటలకి స్టార్ మా ఛానల్ లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM