‘తంగలాన్‌’ పరిస్థితి ఏమిటి?

by సూర్య | Mon, Jun 17, 2024, 01:14 PM

విక్రమ్‌ హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘తంగలాన్‌’  పా.రంజిత్ దర్శకుడు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ నేపథ్యంలో వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌, నీలమ్‌ ప్రొడక్షన్స్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రం నిర్మించారు. ‘తంగలాన్‌ ’ సినిమాను మొదట జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో ఏప్రిల్‌కు వాయిదా పడింది. గ్రాఫిక్స్‌ తదితర పనుల వల్ల  అప్పుడు విడుదలకు నోచుకోలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేేసందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. మరి ఈసారైనా విడుదలకు నోచుకుంటుందో లేదో చూడాలి. ప్రయోగాలకు వెనకాడని విక్రయ్‌ ఈ చిత్రం కోసం పెద్ద సాహసమే చేశారు. డీ గ్లామర్‌ పాత్రలో మొత్తం మేకోవర్‌ మార్చేశారు. గతంలో కూడా ఆయన ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM