విడుదల తేదీని లాక్ చేసిన 'స్త్రీ 2'

by సూర్య | Sat, Jun 15, 2024, 05:19 PM

రాజ్‌కుమార్ రావ్ మరియు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన స్త్రీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి మరియు అభిషేక్ బెనర్జీ ఇతరలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్  భేదియాగా కనిపించనున్నాడు. ఈ హర్రర్ చిత్రాన్ని దినేష్ విజన్ మరియు జియో స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సీక్వెల్ విడుదల తేదీని వెల్లడించారు. స్ట్రీ 2 స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15, 2024 నాడు విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో ఐదవ భాగం. ఇటీవల మడాక్ సూపర్‌నేచురల్ యూనివర్స్‌లో నాల్గవ చిత్రం ముంజ్యా గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కొనసాగిస్తోంది.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM