ఊరి పేరు భైరవకోన : 15 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసిన హమ్మా హమ్మా వీడియో సాంగ్

by సూర్య | Sat, Jun 15, 2024, 04:48 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన సినిమా ఫిబ్రవరి 16, 2024న విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ ఫాంటసీ డ్రామాలోని బ్లాక్‌బస్టర్ రెండవ సింగిల్ హమ్మా హమ్మా సాంగ్ కి ప్రేక్షకుల నుండి భారీ స్పందన లభించింది. రామ్ మిర్యాల గానం అందించిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 15 M+ వ్యూస్ ని సాధించింది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

Latest News
 
చీరకట్టులో మత్తెక్కిస్తున్న శ్రద్ధా కపూర్ Sat, Oct 26, 2024, 12:09 PM
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM