by సూర్య | Fri, Jun 14, 2024, 05:21 PM
కోలీవుడ్ లో ఇటీవలే విడుదలైన స్టార్ మూవీ ట్రైలర్‌తో భారీ సంచలనం సృష్టించింది. ఈ సినిమా గత నెలలో థియేటర్లలో విడుదలైంది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత, మూవీ మేకర్స్ గత రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం తమిళ ఆడియోలో మాత్రమే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ప్రసారం అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో ఉన్నట్లు సమాచారం. ప్యార్ ప్రేమ కాదల్ ఫేమ్ ఎలాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అదితి పోహంకర్, ప్రీతి ముఖుందన్, లాల్ మరియు గీతా కైలాసం కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్, శ్రీనిధి సాగర్ నిర్మించారు.
Latest News