by సూర్య | Fri, Jun 14, 2024, 04:44 PM
కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 31, 2024న విడుదల అయ్యింది. ఈ రూరల్ యాక్షన్ డ్రామా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సుట్టంలాసూసి వీడియో సాంగ్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొని యూట్యూబ్ మ్యూజిక్ లో ట్రేండింగ్ టాప్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
Latest News