ఈ నెల 31న విడుదల కానున్న గం..గం..గణేశా

by సూర్య | Tue, May 28, 2024, 08:18 PM

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గం..గం..గణేశా. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు గం..గం..గణేశా  నుంచి ర్యాప్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ ర్యాప్ సాంగ్ ను కంపోజ్ చేసి ప్రణవ్ చాగంటితో కలిసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. ప్రణవ్ చాగంటి లిరిక్స్ అందించారు. ఒకడిది ఘాటు ప్రేమికుడి బాధ, గడగడలాడె గాథ ఇదిరా, ఒకడిది మాట దాటలేని బాట..గెలుపసలు ఎవడిదో..అంటూ కథలోని సోల్ ను రిఫ్లెక్ట్ చేస్తూ ఈ ర్యాప్ సాంగ్ సాగింది. పర్పెక్ట్ లిరిక్స్, బీట్ తో "గం..గం..గణేశా" ర్యాప్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM