దేవర : యూట్యూబ్ మ్యూజిక్‌లో 'ఫియర్‌' సాంగ్ సెన్సేషన్

by సూర్య | Tue, May 28, 2024, 03:54 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఫియర్ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్‌లో గ్లోబల్ టాప్ 100 సాంగ్స్ లో ఫియర్ సాంగ్ 29 పోసిషన్ లో ఉన్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM