కల్కి 2898 AD : ప్రముఖ OTTలో ప్రసారానికి అందుబాటులోకి రానున్న బుజ్జి అండ్ భైరవ వీడియో

by సూర్య | Tue, May 28, 2024, 03:52 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా బుజ్జి అనే ఈవెంట్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 27, 2024న విడుదల కానుంది. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM