'ఉషా పరిణయం' టీజర్ రిలీజ్

by సూర్య | Sat, May 25, 2024, 03:43 PM

పెద్ద స్టార్స్‌తో ఎన్నో సూపర్‌హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించిన దర్శకుడు కె విజయ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంత విరామం తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ ఈసారి తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా తన 'నువ్వే కావాలి', 'మన్మథుడు', 'మల్లీశ్వరి' వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల కేటగిరీలోకి వస్తుందని విజయ్ భాస్కర్ హామీ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Jun 17, 2024, 07:46 PM
'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 07:44 PM
ఇంస్టాగ్రామ్ లో 'పుష్ప 2' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Mon, Jun 17, 2024, 07:38 PM
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM
'SK23' ఆన్ బోర్డులో షాబీర్ Mon, Jun 17, 2024, 07:26 PM