'గం గం గణేశ' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Sat, May 25, 2024, 03:41 PM

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'గం గం గణేశ' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 31, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని సరిగమ సినిమాస్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం ఆన్లైన్ లో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, ప్రిన్స్ యావర్ మరియు జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. 

Latest News
 
కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అల్లు అర్జున్ Tue, Jan 14, 2025, 08:37 PM
'వీర ధీర శూరన్‌' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Tue, Jan 14, 2025, 06:11 PM
'లైలా' నుండి విశ్వక్ సేన్ ఫిమేల్ లుక్ రివీల్ Tue, Jan 14, 2025, 06:06 PM
లెహంగాలో తమన్నా స్టన్స్ Tue, Jan 14, 2025, 06:00 PM
దర్శకుడు త్రినాధరావుకి సపోర్ట్‌గా వచ్చిన హీరోయిన్ Tue, Jan 14, 2025, 05:56 PM