'భజే వాయు వేగం' ట్రైలర్ అవుట్

by సూర్య | Sat, May 25, 2024, 03:36 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమా పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఈరోజు గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం మే 31, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM