మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవకీ నందన వాసుదేవ' టీమ్

by సూర్య | Sat, May 25, 2024, 03:37 PM

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవకీ నందన వాసుదేవ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో అశోక్ సరసన వారణాసి మానస జోడిగా నటిస్తుంది. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM