'భజే వాయు వేగం' ట్రైలర్ లాంచ్ కి వెన్యూ ఖరారు

by సూర్య | Fri, May 24, 2024, 04:50 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'బజే వాయు వేగం' అనే టైటిల్ ని మూవీ మేక్స్ లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌, టీజర్ సినిమా పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని రేపు మధ్యాహ్నం 12:15 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం మే 31, 2024న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
విజయ్ దేవరకొండ 'VD14' టైటిల్, ఫస్ట్ లుక్ జనవరి 26న విడుద Sat, Jan 24, 2026, 07:25 PM
చిరంజీవితో సినిమా.. దర్శకులకు కఠిన నిబంధనలు Sat, Jan 24, 2026, 07:14 PM
టైగర్ ష్రాఫ్ కోసం దిశా పటానీ బహిరంగ వ్యాఖ్యలు Sat, Jan 24, 2026, 07:13 PM
రవితేజ హారర్ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్! Sat, Jan 24, 2026, 07:12 PM
‘ఎల్లమ్మ’లో డీఎస్పీ డబుల్ ధమాకా.. Sat, Jan 24, 2026, 03:39 PM