కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'టైసన్‌ నాయుడు'

by సూర్య | Fri, May 24, 2024, 04:45 PM

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ బాక్సింగ్ ప్రియుడిగా మరియు లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా కనిపించనున్నాడు. తాజాగా ఈరోజు రాజస్థాన్‌లో రెండు వారాల షెడ్యూల్‌ను మూవీ మేకర్స్ ప్రారంభించనున్నారు. స్టంట్ మాస్టర్ శివ  పర్యవేక్షణలో టీమ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని రూపొందిస్తుంది, ఇది సినిమా హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు కాగా, హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉన్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవర' అనంతపూర్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Mon, Jun 17, 2024, 07:12 PM
'లక్కీ బాస్కర్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Jun 17, 2024, 07:09 PM
19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'అపరిచితుడు' Mon, Jun 17, 2024, 07:06 PM
త్వరలో విడుదల కానున్న 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ Mon, Jun 17, 2024, 07:04 PM
అన్ని మ్యూజిక్ ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులోకి వచ్చిన 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 07:01 PM