డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ప్రసన్నవదనం'

by సూర్య | Fri, May 24, 2024, 04:43 PM

అర్జున్ YK దర్శకత్వంలో టాలీవుడ్ హీరో సుహాస్ నటించిన 'ప్రసన్నవదనం' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 24, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ మరియు రాశి సింగ్ మహిళా కథానాయికలుగా నటించారు. నందు, వైవా హర్ష, చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత మరియు కుశాలిని ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM