'గ్యాంగ్స్ అఫ్ గోదావరి' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు

by సూర్య | Fri, May 24, 2024, 04:40 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మే 25న హైదరాబాద్ లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని దేవి థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jun 17, 2024, 07:49 PM
'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Jun 17, 2024, 07:46 PM
'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 07:44 PM
ఇంస్టాగ్రామ్ లో 'పుష్ప 2' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Mon, Jun 17, 2024, 07:38 PM
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM