'మిరాయి' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, May 24, 2024, 04:37 PM

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో  తేజ సజ్జా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ మిరాయ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా గ్లింప్సె ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు మే 24 - 26 మధ్య వాషింగ్టన్‌లోని సీటెల్‌లో జరిగే TTA మెగా కన్వెన్షన్‌లో ప్రత్యేకంగా 3Dలో మిరాయ్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి భాగం ఏప్రిల్ 18, 2025న పెద్ద స్క్రీన్‌లపై 2D మరియు 3D ఫార్మాట్‌లలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషలలో విడుదల కానుంది. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను గౌర హరి అందించనున్నారు. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM