'సత్యభామ' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Fri, May 24, 2024, 03:57 PM

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ సినిమా యొక్క ట్రైలర్ ని ఈరోజు హైదరాబాద్ లోని ITC కోహినూర్ లో రాత్రి 8:01 గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సల్మాన్‌ ఖాన్‌కు యూట్యూబర్‌ బెదిరింపులు Mon, Jun 17, 2024, 03:50 PM
'పుష్ప 2' విడుదల అప్పుడేనా? Mon, Jun 17, 2024, 03:48 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'సరిపోదా శనివారం' లోని గారం గారం సాంగ్ Mon, Jun 17, 2024, 03:39 PM
'SK23' ఆన్ బోర్డులో విక్రాంత్ Mon, Jun 17, 2024, 03:37 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' Mon, Jun 17, 2024, 02:59 PM