రెడ్ లెహంగాలో మతిపోగోడుతున్న కృతి శెట్టి

by సూర్య | Fri, May 24, 2024, 11:42 AM

డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రంతోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది. వైష్ణవ్ తేజ్ తో కలసి కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అందింది. ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతా ఊహించనట్లుగానే కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. వీటిలో బంగార్రాజు మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది . మిగిలిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. దీనితో కృతి శెట్టికి క్రమంగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి.   గత ఏడాది కృతి శెట్టి కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రంలో నటించింది. నాగ చైతన్య సరసన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ చిత్రం మ్యాజిక్ చేసి తనకు బ్రేక్ ఇస్తుందని కృతి భావించింది. కానీ ఆ చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది.   దీనితో కృతి శెట్టి కెరీర్ ఒక రకంగా డైలమాలో పడింది అనే చెప్పాలి. ఉప్పెన తర్వాత ఆమెకి వచ్చిన ఆఫర్స్ చూసి తప్పకుండా టాప్ లీక్ హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు.  కానీ కృతి శెట్టిని దురదృష్టం వెంటాడుతోంది.గ్లామర్ పరంగా ఇప్పటికీ కృతి శెట్టి యువతకి ఫేవరిట్ బ్యూటీనే అని చెప్పాలి. 2023 కృతి శెట్టికి నిరాశాజనకంగా ముగిసింది. కొత్త సంవత్సరంలో అయినా తనకి కలసి రావాలని ఈ ఉప్పెన పిల్ల భావిస్తోంది. ప్రస్తుతం కృతి శెట్టి శర్వానంద్ సరసన మనమే అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా కృతి శెట్టి కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటో షూట్ షేర్ చేసింది. సరికొత్తగా మరింత అందంగా కనిపిస్తున్న కృతి శెట్టి లెహంగా లుక్ అదిరిపోయింది. రెడ్ లెహంగాలో కృతి శెట్టి ఎంతో అందంగా యువతని ఆకట్టుకుంటోంది. 



 


 

Latest News
 
500 మంది మహిళలకు ఉచిత క్యాన్సర్ చికిత్స అందించిన సోనూసూద్ Wed, Dec 17, 2025, 11:44 AM
రేపు ప్రభాస్ 'రాజాసాబ్' పాట విడుదల Wed, Dec 17, 2025, 10:45 AM
Peddi Movie: ‘చికిరీ చికిరీ’ సాంగ్ సెన్చురీ! మాస్ క్రేజ్ కాస్త అదిరిపోయింది Tue, Dec 16, 2025, 10:22 PM
Vrushabha: మోహన్ లాల్ అభిమానులు గుడ్ న్యూస్! రిలీజ్ డేట్ లాక్ అయింది Tue, Dec 16, 2025, 10:00 PM
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఇపుడు అదే హీరోతో హీరోయిన్‌గా Tue, Dec 16, 2025, 07:42 PM