'సత్యభామ' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ప్రముఖ హీరో

by సూర్య | Thu, May 23, 2024, 04:21 PM

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి సత్యభామ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా యొక్క ట్రైలర్ ని మే 24న హైదరాబాద్ లోని ITC కోహినూర్ లో సాయంత్రం 6:30 గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM