డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'రత్నం'

by సూర్య | Thu, May 23, 2024, 04:14 PM

భరణి, పూజ తర్వాత మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ హరితో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన రత్నం సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో మే 23న స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో విశాల్ కి జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ప్రముఖ తమిళ నటుడు-చిత్ర నిర్మాతలు సముద్రఖని మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తెకేన్ సంతానం, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM