పుష్ప 2 : ది కపుల్ సాంగ్ అనౌన్స్మెంట్ వీడియో అవుట్

by సూర్య | Thu, May 23, 2024, 03:27 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలోని మొదటి సింగిల్ పుష్ప పుష్ప సాంగ్ భారీ సెన్సేషన్ ని సృష్టించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ని 'ది కపుల్ సాంగ్' అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
'రాజా సాబ్' నుండి ప్రభాస్ స్పెషల్ పోస్టర్ అవుట్ Mon, Oct 21, 2024, 06:07 PM
'పొట్టెల్' అంతటా చర్చనీయాంశంగా మారుతుంది - అనన్య నాగళ్ల Mon, Oct 21, 2024, 06:02 PM
బిగ్ బాస్ 8 తెలుగు : మణికంఠ నిర్ణయంతో నిరాశ చెందిన అభిమానులు Mon, Oct 21, 2024, 05:56 PM
‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్ Mon, Oct 21, 2024, 02:44 PM
గూస్ బంప్స్ వచ్చాయి: నటుడు అజయ్ Mon, Oct 21, 2024, 01:04 PM