37M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'దేవర' ఫస్ట్ సింగల్

by సూర్య | Wed, May 22, 2024, 04:47 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని ఫియర్ అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 37 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, శృతిమరాఠే, తారక్ పొన్నప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది.

Latest News
 
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..? Sun, Oct 20, 2024, 02:47 PM