'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో అవుట్

by సూర్య | Wed, May 22, 2024, 03:51 PM

కృష్ణ చైతన్య దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన తదుపరి చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. కొన్ని నెలల క్రితం విడుదలైన టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ యొక్క ప్రోమోని మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 31, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సెట్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 05:11 PM
'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Sat, Oct 19, 2024, 05:00 PM
ఏడాది పూర్తి చేసుకున్న 'లియో' Sat, Oct 19, 2024, 04:55 PM
అనన్య ఆశ‌ల‌న్నీ ఆ సినిమా పైనే! Sat, Oct 19, 2024, 04:49 PM
'మున్నా భాయ్ 3' ని ధృవీకరించిన రాజ్‌కుమార్ హిరానీ Sat, Oct 19, 2024, 04:46 PM