మిరాయి : 5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న మంచు మనోజ్ ది బ్లాక్ స్వోర్డ్ గ్లింప్సె

by సూర్య | Wed, May 22, 2024, 03:48 PM

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో  తేజ సజ్జా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ మిరాయ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న పెద్ద స్క్రీన్‌లపై 2D మరియు 3D ఫార్మాట్‌లలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషలలో విడుదల కానుంది. ఇటీవలే మూవీ మేకర్స్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా నటుడి ఫస్ట్ లుక్ పోస్టర్ ని మరియు గ్లింప్సెని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ గ్లింప్సె ఇప్పుడు యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ 2 పోసిషన్ లో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను గౌర హరి అందించనున్నారు. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు.

Latest News
 
ప్రిన్స్ పరాజయం తర్వాత అజిత్ ఏం చెప్పాడో వెల్లడించిన శివ కార్తికేయన్ Sat, Oct 19, 2024, 03:56 PM
టాలీవుడ్ నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - అజయ్ Sat, Oct 19, 2024, 03:51 PM
'కంగువ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Sat, Oct 19, 2024, 03:46 PM
తెలుగు సినిమాలపై ఆసక్తిని చూపుతున్న ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Oct 19, 2024, 03:41 PM
'ఓదెలా 2' లో తమన్నా సంచలనం Sat, Oct 19, 2024, 03:36 PM