విజయ్ 'ది గోట్' కోసం పని చేసుతున్న ప్రఖ్యాత VFX కంపెనీ

by సూర్య | Fri, May 17, 2024, 06:48 PM

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభుతో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో విజయ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాకి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T.) అనే టైటిల్ ని లాక్ చేసారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇటీవల మూవీ మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఇప్పుడు కెప్టెన్ అమెరికా: సివిల్ వార్, యాంట్-మ్యాన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మరియు కమల్ హాసన్ యొక్క ఇండియన్ 2 వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో పనిచేసినందుకు ప్రసిద్ధి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ లోలా VFX ది గోట్ కి పని చేస్తోందని ధృవీకరించబడింది. ఈ చిత్రానికి సంబంధించిన డి-ఏజింగ్ వర్క్ ప్రస్తుతం కంపెనీలో జరుగుతోందని ధృవీకరించబడింది.

ఈ సినిమాలో విజయ్ సరసన హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2024న గ్రాండ్ విడుదల కానుంది. ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్, అరవింద్ ఆకాష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అర్చన కలాపతి, కళపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కళపతి ఎస్ సురేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు.

Latest News
 
'కుబెరా' చేసినందుకు గర్వంగా అనిపిస్తుంది - శేఖర్ కమ్ముల Mon, Mar 24, 2025, 09:28 PM
హైదరాబాద్కు 140 దేశాల అందాల భామలు Mon, Mar 24, 2025, 08:22 PM
విజయ్‌ ‘జన నాయగన్‌’.. విడుదల తేదీ ఖరారు Mon, Mar 24, 2025, 08:13 PM
ఈ కార‌ణంతో నేను ఎన్నో అవ‌కాశాలు కోల్పోయా Mon, Mar 24, 2025, 07:26 PM
'OG' నుండి ఇమ్రాన్ హష్మీ స్పెషల్ పోస్టర్ రిలీజ్ Mon, Mar 24, 2025, 07:12 PM