'తండేల్' మూవీ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో విడుదల

by సూర్య | Thu, May 09, 2024, 12:17 PM

అక్కినేని నాగచైతన్య మరియూ సాయి పల్లవి జంటగా నషస్తున్న సినిమా 'తండేల్'. ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ గా వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాల నుంచి ఫోటోలను తీసుకొని వీడియోను డిజైన్ చేశారు. ఈ వీడియో సాయి పల్లవి ఫాన్స్ కి తెగ నచ్చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM