విజయ్ దేవరకొండ బ‌ర్త్‌డే స్పెషల్ గా తన కొత్త సినిమా పోస్టర్ వచ్చేసింది...

by సూర్య | Thu, May 09, 2024, 11:57 AM

 హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది.దీనితో నెగటివ్ టాక్ ఎఫెక్ట్ ఈ సినిమా కలెక్షన్స్ పై పడటంతో ఈసినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు.అయితే రీసెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ఈ మూవీ అదిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతుంది.తాజాగా విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాను ప్రకటించారు.మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో విజయ్ సినిమా చేస్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.రీసెంట్ ఈ సినిమాను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. నేడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.చెప్పినట్లుగానే మేకర్స్ ఒక పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ లో "కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే.." అంటూ కత్తి పట్టుకున్న లుక్ ను రిలీజ్ చేసారు. సినిమా దిల్ రాజు బ్యానర్ లో 59 వ సినిమాగా రానుంది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .


 

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM