ఆశిష్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'లవ్ మి – ఇఫ్ యు డేర్' టీమ్

by సూర్య | Wed, May 01, 2024, 03:12 PM

రౌడీ బాయ్స్‌లో తన పాత్రతో పేరు తెచ్చుకున్న ఆశిష్ రెడ్డి ఇటీవల నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు లవ్ మి – ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా మే 25, 2024న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా హీరో ఆశిష్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. వైష్ణవి చైతన్య, ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించనుంది.


దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్ Tue, May 21, 2024, 08:45 PM
తన సినీ కెరీర్‌ను వదిలేయనున్న స్టార్ హీరోయిన్ Tue, May 21, 2024, 08:43 PM
'రత్నం' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Tue, May 21, 2024, 08:41 PM
త్వరలో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్న 'యక్షిణి' Tue, May 21, 2024, 08:37 PM
క్రేజీ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ 'పుష్ప 2' షూటింగ్ Tue, May 21, 2024, 06:51 PM