'రాజు యాదవ్' నాలగవ సింగల్ ని విడుదల చేయనున్న స్థార్ డైరెక్టర్

by సూర్య | Tue, May 21, 2024, 08:45 PM

కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను కథానాయకుడిగా ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ రాజు యాదవ్ అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం మే 24, 2024న థియేట్రికల్ విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నాలగవ సింగల్ ని ఫీల్ మై స్మైల్ అనే టైటిల్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అంకితా ఖరత్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కె ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Latest News
 
కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అల్లు అర్జున్ Tue, Jan 14, 2025, 08:37 PM
'వీర ధీర శూరన్‌' ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన Tue, Jan 14, 2025, 06:11 PM
'లైలా' నుండి విశ్వక్ సేన్ ఫిమేల్ లుక్ రివీల్ Tue, Jan 14, 2025, 06:06 PM
లెహంగాలో తమన్నా స్టన్స్ Tue, Jan 14, 2025, 06:00 PM
దర్శకుడు త్రినాధరావుకి సపోర్ట్‌గా వచ్చిన హీరోయిన్ Tue, Jan 14, 2025, 05:56 PM