'ఆ ఒక్కటి అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్

by సూర్య | Mon, Apr 29, 2024, 03:01 PM

మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 1న హైదరాబాద్ లోని దస్పల్లాలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా మే 3న విడుదల కానుంది. ఈ సినిమాలో అరియానా మరియు హర్ష చెముడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'ఇండియన్ 2' విడుదల అప్పుడేనా? Wed, May 15, 2024, 06:52 PM
యూట్యూబ్ ట్రెండింగ్ లో 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ Wed, May 15, 2024, 06:50 PM
'హరోమ్ హర' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 15, 2024, 06:42 PM
'రత్నం' డిజిటల్ ఎంట్రీ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 15, 2024, 06:39 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలి షెడ్యూల్ జరిగేది ఎప్పటివరకంటే...! Wed, May 15, 2024, 06:11 PM