భారీ మొత్తానికి అమ్ముడయిన 'తాండల్' డిజిటల్ రైట్స్

by సూర్య | Mon, Apr 29, 2024, 02:56 PM

దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్ 40 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ త్వరలో అధికారకంగా ప్రకటించనున్నారు.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM